సండే.. సూపర్ మ్యాచ్

కొలొంబో వేదికగా ఈరోజు భారత్ - శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది

Update: 2023-09-17 05:28 GMT

నేడు మరో రసవత్తరమైన మ్యాచ్ ను చూడబోతున్నాం. ఆసియా కప్ ఫైనల్ లో గెలుపు ఎవరన్న టెన్షన్ క్రీడాభిమానుల్లో నెలకొంది. కొలొంబో వేదికగా ఈరోజు భారత్ - శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆసియా దేశాల్లోని క్రికెట్ అభిమానులంతా వేచి చూస్తున్నారు. గెలుపు ఎవరిదని ముందుగా నిర్ధారించలేం. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. ఇది ఆట. మైదానంలో ఎవరు క్లిక్ అయితే వారిదే విక్టరీ. అందుకే కొలొంబోలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

బంగ్లాతో ఓటమి చెందినా...
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోవడాన్ని కొందరు విమర్శలు చేస్తున్నా దానిని పరిగణనలోకి తీసుకోవద్దని క్రీడాపండితులు చెబుతున్నారు. సీనియర్లు లేకపోవడం, కొంత నిర్లక్ష్యం ఓటమికి కారణంగా చూపుతున్నారు. అయితే ఫైనల్ లో భారత్ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. బ్యాటర్లలో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లు ఫుల్ ఫాంలో ఉండటం కలసి వచ్చే అంశం. బౌలర్లలో కూడా కులదీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్ లు కూడా మంచి ఊపు మీదుండి వికెట్లు తీస్తారన్న నమ్మకం భారత క్రికెట్ అభిమానుల్లో ఉంది.
లంక కూడా...
అయితే అదే సమయంలో శ్రీలంకకు హోం పిచ్. సొంత మైదానంలో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. దీంతో పాటు ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ పరంగా కూడా పటిష్టంగా ఉంది. కుశాల్ పెరీరా, కుశాల్ మెండీస్, అసలంక ఫామ్ లో ఉన్నారు. దునిత్ వెల్లలాగే వంటి స్పిన్నర్లు ఎటూ ఉండనే ఉణ్నారు. పరితరణ, రజిత వంటి బౌలర్లతో పటిష్టంగానే కనపడుతుంది. దీంతో ఇరు జట్లలో ఏది గెలుపు అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే కొలొంబోలో ఈరోజు వర్షం కురిసే ఛాన్స్ నలభై శాతం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో ఫ్యాన్స్ లో కొంత ఆందోళన కలుగుతుంది. ఆదివారం కావడంతో ఈ మ్యాచ్ ను కోట్ల మంది చూస్తుండటంతో వరుణులు కరుణిస్తాడా? శపిస్తాడా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News