టాస్ గెలిచిన ఇండియా.. పిచ్ రిపోర్ట్ ఇదే
భారత్ - న్యూజిలాండ్ మధ్య చివరి టీ 20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది.
భారత్ - న్యూజిలాండ్ మధ్య చివరి టీ 20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. తొలుత న్యూజిలాండ్ ఫీల్డింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ సిరీస్ ను డిసైడ్ చేసేది కావడంతో భారత్ బ్యాటర్లు ధీటుగా ఆడాల్సి ఉంటుంది. అత్యధిక పరుగులు చేయాల్సి ఉంటుంది. బ్యాటర్లు ఆచి తూచి ఆడితేనే ఈ పిచ్ మీద అత్యధిక స్కోరు లభిస్తుంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. పరుగుల వరద చూస్తారని చెబుతున్నారు.
బౌలర్లు కూడా...
అయితే భారత్ భారీ స్కోరు చేయగలిగినా ఆ తర్వాత బౌలర్లు కూడా రాణించాల్సి ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారత్ బౌలర్లు అత్యధిక పరుగులు ఇస్తున్నారు. దీని నుంచి బౌలర్లు బయటపడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ లో ఆల్‌రౌండర్లు ఎక్కువ. ఏడో వికెట్ వరకూ ఆల్ రౌండర్లే ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వికెట్లు త్వరత్వరగా తీయాల్సి ఉంటుంది. లేకుంటే సొంత గడ్డ మీద చాలా ఏళ్ల తర్వాత సిరీస్ చేజార్చుకోవాల్సి వస్తుంది.