బ్రతికే ఉన్నా: హీత్ స్ట్రీక్

బ్రతికే ఉన్నానని అంటున్న హీత్ స్ట్రీక్

Update: 2023-08-23 08:16 GMT

క్రికెట్ లెజెండ్ హీత్ స్ట్రీక్ కన్నుమూశాడంటూ పలు నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు నివేదించగా.. ఆ వార్తల్లో నిజం లేదని హీత్ స్ట్రీక్ చెప్పుకొచ్చాడు. జింబాబ్వే మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ 49 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశారని హీత్ సహచరుడు, జింబాబ్వే బౌలర్ హెన్రీ ఒలోంగా సోషల్ మీడియాలో చెప్పడంతో ఆ వార్త క్రికెట్ అభిమానులకు షాకింగ్ గా మారింది. అయితే హీత్ స్ట్రీక్ చనిపోలేదని తెలుస్తోంది. తాను చనిపోయాననేది పెద్ద రూమర్ అని అన్నారు. తాను బతికి ఉన్నానా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోకుండానే ప్రచారం చేశారని విమర్శించారు. ఈ వార్తలతో తాను హర్ట్ అయ్యానని చెప్పారు. ఈ వార్తను ప్రచారం చేసిన వారు తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జింబాబ్వే జట్టు అద్భుతంగా ఆడుతున్న సమయంలో హీత్ స్ట్రీక్ ఆల్ రౌండర్ ఆటతీరు జట్టుకు గొప్ప విజయాలను అందించింది. 2000-2004 కాలంలో గొప్ప క్రికెటర్లలో ఒకరైన స్ట్రీక్, 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. జింబాబ్వే తరపున 100 టెస్ట్ వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. దాదాపు 12 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ అతడి సొంతం. ప్రధానంగా అతని బౌలింగ్ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ.. స్ట్రీక్ జట్టు మిడిల్ ఆర్డర్‌లో బ్యాట్‌తో కూడా అద్భుతమైన సహకారం అందించేవాడు. అతని కెరీర్‌లో మొత్తం 1990 టెస్ట్ పరుగులు, వన్డే కెరీర్ లో 2943 పరుగులు చేశాడు. అతను వెస్టిండీస్‌పై హరారేలో తన మొదటి, ఏకైక టెస్టు సెంచరీ (127*) సాధించాడు. హీత్ 1993లో పాకిస్తాన్‌పై అరంగేట్రం చేశాడు. 2005లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL) కూడా ఆడాడు. స్ట్రీక్ కోచింగ్ కెరీర్‌లో జింబాబ్వే, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లకు సేవలు అందించాడు.


Tags:    

Similar News