హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మకు సూపర్ ఛాన్స్
అండర్-19 ప్రపంచ కప్ లో సత్తా చాటి మంచి పేరు సంపాదించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఎ తో జరుగుతున్న
తిలక్ వర్మ.. అండర్-19 ప్రపంచ కప్ లో సత్తా చాటి మంచి పేరు సంపాదించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఎ తో జరుగుతున్న 'టెస్ట్' సిరీస్ లో భారత జట్టులో భాగమైన ఠాకూర్ తిలక్ వర్మ.. వన్డే సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ ఎ తో జరిగిన మొదటి టెస్ట్ లో సెంచరీ చేసిన తిలక్ వర్మకు.. వన్డే సిరీస్ లో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు అరంగేట్రం చేసిన మొదటి సీజన్‌లోనే తన సత్తా చూపించాడు. ఇప్పుడు భారత్-ఎ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో పడ్డాడు. సెప్టెంబరు 22 నుండి చెన్నైలో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టులో ఇండియా A జట్టులో తిలక్ వర్మ భాగమయ్యాడు.
సిరీస్ లో మిగిలిన రెండు వన్డేలు సెప్టెంబర్ 25, 27 తేదీల్లో జరగనున్నాయి. దులీప్ ట్రోఫీలో మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా, జింబాబ్వేలో జరిగిన వన్డే సిరీస్‌లో భాగమైన చాలా మంది ఆటగాళ్లతో వన్డే జట్టును తయారు చేస్తున్నారు. భారతదేశం U-19 ప్రపంచ కప్ విజేతగా నిలవడానికి కారణమైన ఫాస్ట్ మీడియం బౌలర్, ఎడమచేతి హార్డ్-హిట్టింగ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రాజ్ అంగద్ బవా కూడా అవకాశం దక్కించుకున్నాడు. బవా చండీగఢ్ జట్టు తరపున రెండు రంజీ ట్రోఫీ గేమ్‌లు మాత్రమే ఆడాడు. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 'హార్దిక్ పాండ్యా' తర్వాతి ఆల్ రౌండర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. శివమ్ దూబే, విజయ్ శంకర్ వంటి వారు అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించకపోవడంతో, బ్యాకప్ సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్ల సమూహాన్ని సృష్టించేందుకు సెలెక్టర్లు ప్రయత్నిస్తూ ఉన్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్-రౌండర్ ఎంపికలు చాలానే ఉన్నా.. లోయర్ మిడిల్ ఆర్డర్ లో హిట్టింగ్ చేస్తూ.. పేస్ బౌలింగ్ తో ఆకట్టుకునే ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. బవా ఆల్-రౌండ్ సామర్థ్యాలు ఈ సిరీస్ లో పరీక్షించనున్నారు.
ఇండియా ఎ జట్టు: పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటీదార్, సంజు శాంసన్ (కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్-కీపర్), కుల్దీప్ యాదవ్, షాభాజ్ అహ్మద్, రాహుల్ చాహర్, తిలక్ వర్మ, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్ , ఉమ్రాన్ మాలిక్, నవదీప్ సైనీ, రాజ్ అంగద్ బవా.