ఆస్ట్రేలియాతో భారత్ తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో మన బ్యాటింగ్ యూనిట్ రాణించింది. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ రాణించగా.. కోహ్లీ, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ పర్వాలేదనిపించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆసీస్. రోహిత్ శర్మ ఓ వైపు చూస్తూ ఉండగానే రాహుల్ అద్భుతమైన షాట్స్ తో అలరించాడు. 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు రాహుల్. అతడి ఇన్నింగ్స్ లో 3 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ భారీ షాట్స్ ఆడడానికి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో 15 పరుగులు చేసి రోహిత్ అవుట్ అయ్యాడు. కోహ్లీ(19) కూడా మంచి షాట్స్ ఆడినా.. బౌన్సర్ ను బౌండరీకి తరలించే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో కూడా మెరిశాడు. 33 బంతుల్లో 50 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. భారత్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 2 పరుగులు చేసి విఫలమవ్వగా.. కార్తీక్ 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అశ్విన్ 6 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. అక్షర్ పటేల్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కేన్ రిచర్డ్సన్ కు 4 వికెట్లు పడ్డాయి. బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో భారీ బౌండరీలను క్లియర్ చేయడానికి భారత బ్యాట్స్మెన్ కాస్త కష్టపడ్డారు.