భారత్ ను విడిచి వెళ్ళిపోయిన జైనాబ్ అబ్బాస్

పాకిస్థాన్ టీవీ ప్రెజెంటర్ జైనాబ్ అబ్బాస్ గతంలో చేసిన వివాదాస్పద ట్వీట్ల

Update: 2023-10-09 10:13 GMT

పాకిస్థాన్ టీవీ ప్రెజెంటర్ జైనాబ్ అబ్బాస్ గతంలో చేసిన వివాదాస్పద ట్వీట్ల కారణంగా ఆమె భారత్ ను తిరిగి వెళ్లాల్సి వచ్చింది. భారత్ లో జరుగుతున్న ప్రపంచ కప్ కు జైనాబ్ అబ్బాస్ ను ప్రెజెంటర్ గా ఎంపిక చేశారు. అయితే ఆమె గతంలో చేసిన ట్వీట్లు ఆమెను వెంటాడాయి. భారతదేశాన్ని, హిందూ మతాన్ని విమర్శిస్తూ ఆమె చేసిన పాత ట్వీట్‌ల కారణంగా ఆమెను దేశం విడిచి వెళ్లవలసిందిగా కోరారు. జైనాబ్ అబ్బాస్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం. వినీత్ జిందాల్ అనే భారతీయ న్యాయవాది 35 ఏళ్ల జైనాబ్ పై కొన్ని సంవత్సరాల క్రితం ఆమె చేసిన కొన్ని హిందూ వ్యతిరేక ట్వీట్ల కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె భారత్ లో ఉండడం కంటే విడిచిపెట్టడమే బెటర్ అని భావించారు. అధికారులు ఆమెను పాకిస్థాన్ కు పంపించారు.

సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్, సామాజిక కార్యకర్త వినీత్ జిందాల్ జైనాబ్ అబ్బాస్ పై ఢిల్లీలోని సైబర్ సెల్ విభాగంలో ఇటీవల ఫిర్యాదు చేశారు. జైనాబ్ అబ్బాస్ పై సెక్షన్ ఐపీసీలోని 153ఏ, 295, 506,121, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అధికారులను కోరారు. ఐసీసీ ప్రపంచ కప్ నుంచి తక్షణమే స్పోర్ట్స్ ప్రజెంటర్స్ లిస్ట్ నుంచి ఆమె పేరును తొలగించాలనీ డిమాండ్ చేశారు. దీంతో ఆమె భారత్ ను వీడింది.


Tags:    

Similar News