India Vs New Zealand : నిలకడగా ఆడుతున్న భారత్ ఆటగాళ్లు.. ఖాన్ సెంచరీ
బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో తడబడిన భారత్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా ఆడుతున్నారు
బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో తడబడిన భారత్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా ఆడుతున్నారు. విరాట్ కోహ్లి 70 పరుగులు చేశాడు. అయితే ఇదే ఇన్నింగ్స్‌లో భారత్ యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేయడం విశేషం. కేవలం 110 బాల్స్ లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో తొలి సెంచరీని సర్ఫరాజ్ ఖాన్ నమోదు చేయడంతో ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. దూకుడుగా ఆడుతూ ఫోర్లతో అదరగొట్టేశాడు.
నిలకడగా ఆడుతూ...
ప్రస్తుతం రిషబ్ పంత్ తో కలసి తన ఆటను కొనసాగిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్ లో ఇండియాను గట్టించే ప్రయత్నంలో ఉన్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. భారత్ 46 పరుగులకే అవుట్ కావడంతో 356 పరుగులు చేయాల్సి ఉండగా భారత్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో కుదుటుగా ఆడుతుండటంతో కొంత భారత్ కు మెరుగైన స్కోరు దిశగా పయనించే అవకాశముంది. సర్ఫరాజ్ ఖాన్ 125 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 53 పరుగులు చేశాడు. ఇంకా న్యూజిలాండ్ స్కోరును అధిగమించాలంటే పన్నెండు పరుగులు చేయాల్సి ఉండగా వర్షం పడటంతో ఆట నిలిచిపోయింది. భారత్ 344 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.