India Vs Australia : భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా.. మూడో టెస్ట్ లోనూ?
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆసిస్ ఆటగాళ్లు భారీస్కోరు చేశారు
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆసిస్ ఆటగాళ్లు భారీస్కోరు చేశారు. గబ్బా టెస్ట్ లో మొదటి రోజు వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. క్రీజులో అలెక్స్ కేరీ ఉన్నాడు.కేరీ నలభై ఐదు పరుగులు చేవాడు.మిచెల్ స్టార్క్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు.
బుమ్రా ఐదు వికెట్లు...
భారత్ బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లను త్వరగా పెవిలియన్ బాట పట్టించేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. ట్రావిస్ హెడ్ 152 పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్ 101 పరుగులు చేశాడు. ఇద్దరు సెంచరీలు బాదడంతో ఇంతటి స్కోరు సాధ్యమయింది. భారత్ బౌలర్లలో జస్ప్రిత్ బూమ్రా ఐదు వికెట్లు తీయడంతో హెడ్ తో పాటు మరి కొందరిని అవుట్ చేయగలిగాడు. అయితే ఈపిచ్ బ్యాటర్లకు అనుకూలమని చెబుతున్నారు. భారత్ మరి ఈ టెస్ట్ లో ఏం చేస్తుందో చూడాలి.