Australia - India : రెండో టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం
భారత్ ఆస్ట్రేలియాతో జరుగున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయం పాలయింది
భారత్ ఆస్ట్రేలియాతో జరుగున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయం పాలయింది. ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో భారత్ చేతులెత్తేసింది. పది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్ బ్యాటర్లు, బౌలర్లు విఫలం కావడంతో పాటు సీనియర్ బ్యాట్స్ మెన్లు కూడా కొద్దిసేపు కూడా క్రీజులో ఉండలేకపోవడంతో ఆస్ట్రేలియా విజయానికి కారణని చెప్పకతప్పదు.
19 పరుగుల లక్ష్యంతో...
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 180 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 175 పరుగులు మాత్రమే చేసింది. కేవలం 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సునాసాయంగా విజయం సాధించింది. కేవలం 3.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా భారత్ పై గెలిచింది. రెండు ఇన్నింగ్స్ లోనూ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లిలు దారుణంగా విఫలమయ్యారు. ఏ ఆర్డర్ లో వచ్చినా వీరు నిలబడి ఆడింది లేకపోవడంతో భారత్ కు పరాజయం తప్పలేదు. రెండు ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.