ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు దుమ్ము దులిపారు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు దుమ్ము దులిపారు. శుభ్‌మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో చెలరేగగా.. కేఎల్ రాహుల్(52), సూర్య కుమార్ యాదవ్(72) హాఫ్ సెంచరీలతో ఆఖర్లో అదరగొట్టారు. దీంతో భారతజట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. సిరీస్ ను కాపాడుకోవాలంటే ఆసీస్ 400 పరుగులు చేయాలి. సూర్యకుమార్ యాదవ్ ఒకే ఓవర్ లో నాలుగు సిక్సర్లు బాదడం విశేషం. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ 10 ఓవర్లలో 103 పరుగులు ఇచ్చుకున్నాడు. గ్రీన్ 2 వికెట్లు తీయగా.. హాజెల్ వుడ్, అబాట్, జంపా చెరో వికెట్ తీసుకున్నారు.
రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు.