దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి

Update: 2022-10-30 14:42 GMT

పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. భారత్ తక్కువ స్కోరే చేసినా.. ఆ స్కోరును సాధించడానికి దక్షిణాఫ్రికా చాలానే కష్టపడింది. ఆఖరి ఓవర్ వరకూ మ్యాచ్ ను తీసుకుని వెళ్లారు భారత బౌలర్లు. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా విజయాన్ని అందుకుంది. అయిదు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయాన్ని అందుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసింది. సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులు చేయడంతో భారత్ కు ఓ మోస్తరు పరుగులు మాత్రమే వచ్చాయి. రోహిత్ శర్మ 15, విరాట్ కోహ్లీ 12 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ (9), దీపక్ హుడా (0), హార్దిక్ పాండ్యా (2), దినేశ్ కార్తీక్ (6) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, వేన్ పార్నెల్ 3 వికెట్లు తీశారు.
ఇక ఛేజింగ్ లో భారత బౌలర్లు విజృంభించారు. డికాక్ ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరగగా.. ఆ తర్వాత వచ్చిన రైలీ రుసోవ్ డకౌట్ గా వెనుదిరిగాడు. కెప్టెన్ బవుమా.. 15 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత మిల్లర్, మార్కరమ్ లు భారత్ కు విజయావకాశాలను దూరం చేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మార్కరమ్ 41 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మిల్లర్ 46 బంతుల్లో 59 పరుగులు చేసి మ్యాచ్ ను ముగించాడు.


Tags:    

Similar News