India vs Afghanistan T20 : నేడు ఇండియా - ఆప్ఘనిస్థాన్ తొలి టీ 20
ఇండియా నేడు ఆప్ఘనిస్థాన్ తో జరిగేే మొదటి టీ 20 మ్యాచ్ ను ఆడనుంది.మొహాలీలో ఈ మ్యాచ్ జరగనుంది;

india will play the first t20 match against afghanistan today.
ఇండియా నేడు ఆప్ఘనిస్థాన్ తో జరిగేే మొదటి టీ 20 మ్యాచ్ ను ఆడనుంది. ఆప్ఘనిస్థాన్ తో టీం ఇండియా మొత్తం మూడు టీ 20 మ్యాచ్ లను ఆడనుంది. ఇందులో తొలి మ్యాచ్ నేడు జరగనుంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. మొహాలీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. పథ్నాలుగు నెలల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి జట్టులోకి వచ్చారు. అయితే ఈ రోజు మాత్రం విరాట్ ఆడటం లేదు.
భారత్ జట్టు...
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ ఆడనున్నారు. వీరితో పాటు రింకూ సింగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేశ్ శర్మ, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ లు ఆడే అవకాశాులన్నాయి. మొహాలీ పిచ్ బ్యాటింగ్ కే అనుకూలమని పిచ్ పండితులు చెబుతున్నారు. స్పిన్నర్లకు కూడా ఈ పిచ్ అనుకూలించే అవకాశముందని అంచనా వినిపిస్తుంది. టార్గెట్ ను ఛేదించే జట్టుకే అత్యధిక విజయాలు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత్ ఈ పిచ్ పై మూడు మ్యాచ్‌లలో నెగ్గింది.