హరారే లో జింబాబ్వే పరారే

హరారే తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డే లో భారత బౌలర్లు, బ్యాటర్లు రాణించారు.

Update: 2022-08-18 13:25 GMT

హరారే తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత బౌలర్లు, బ్యాటర్లు రాణించారు. సమిష్టి కృషితో తొలి విక్టరీ కొట్టారు. ఓపెనర్లు అవుట్ కాకుండా భారత్ కు విజయాన్ని సాధించి పెట్టారు. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు ప్రసిద్ధ కృష్ణ, అక్షరపటేల్, దీపక్ చాహర్ లు తలా మూడు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో 189 పరుగులకు జింబాబ్వే ఆల్ అవుట్ అయింది.

స్వల్ప లక్ష్యాన్ని....
జింబాబ్వే బ్యాటర్లలో రెజిస్ చకబ్వా 35, బ్రడ్ ఎవస్ 33, రిచర్డ్ 34 పరుగులు చేయగలిగారు. మిగిలిన వారంతా అతి తక్కువ స్కోెరుకే అవుటయ్యారు. 40.3 ఓవర్లలోనే జింబాబ్వే ఆటగాళ్లు అవుట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 30. 5 ఓవర్లలోనే జింబాబ్వే పెట్టిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లుగా దిగిన శిఖర్ ధావన్ 81, శుభమన్ గిల్ 81 పరుగులు చేసి భారత్ కు విజయాన్ని సాధించారు. మూడు వన్డేల సిరీస్ లో భారత్ తొలి వన్డేలో గెలిచి ఆధిక్యతను కొనసాగిస్తుంది


Tags:    

Similar News