India Vs Newzealand Champions Trophy : ఇంత తక్కువ పరుగులా? వాళ్లు ఊదిపారేయరూ
భారత్ - న్యూజిలాండ్ మధ్య దుబాయ్ లో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు;

మనోళ్లు మారలేదు. సెమీ ఫైనల్స్ కు వెళ్లామన్న సీనియర్ ఆటగాళ్ల ధీమా కావచ్చు.. ఎడాది దేశంలో భారత అభిమానుల ఆశలను ఇసుకలో కలిపేశారు. అలా వచ్చి ఇలా వెళుతూ తర్వాత వచ్చే వారిపై వత్తిడి పెంచారు. భారత్ - న్యూజిలాండ్ మధ్య దుబాయ్ లో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ అనవసర క్యాచ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఓపెనర్ గా దిగిన శుభమన్ గిల్ బ్యాడ్ లక్. ఎల్.బి.డబ్యూ తో వెనుదిరగాల్సి వచ్చింది. రోహిత్ శర్మ అవుట్ అయిన వెంటనే విరాట్ కోహ్లి నేనొస్తున్నానంటూ అతని వెంటే నడిచాడు. అతి తక్కువ పరుగులకు ఇద్దరు అవుట్ కావడంతో శ్రేయ్యర్, అక్షర్ పటేల్ మంచి భాగస్వామ్యాన్ని వత్తిడితో నెలకొల్పారు.
తక్కువ పరుగులకే...
అక్షర్ పటేల్ 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కుదురుకున్న శ్రేయస్ అయ్యర్ 79 పరుగుల వద్ద అవుట్ కావడంతో ఇకరన్ రేట్ కూడకా తగ్గుతుంది. న్యూజిలాండ్ ముందు భారీ పరుగుల లక్ష్యాన్ని ఉంచాల్సిన భారత్ అతి తక్కువ పరుగులకే చేతులెత్తేసిందని చెప్పాలి. 44 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి మన బ్యాటర్లు కొద్దిసేపు కూడా నిలబడలేకపోతున్నారు. నిలబడ్డారులే అనుకున్న వెంటనే అనవసర షాట్ కు ప్రయత్నించి అవుట్ అవుతూ ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్నారు. మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా 23 పరుగుల వద్ద అవుటయి ఇక స్కోరు 250 పరుగులకు దాటేలా లేదు అనిపించింది.
భారీ స్కోరు చేయాల్సిన...
పోరాట పటిమను ప్రదర్శించాల్సిన భారత్ జట్టు న్యూజిలాండ్ కు ఏకపక్షంగా అప్పగించేసినట్లే కనపడుతుంది. ఫోర్లు, సిక్సర్లు బాదాల్సిన టైంలో సింగ్ల్ తీయడానికి కూడా కష్టపడుతున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్లు మంచి ఫామ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటువంటి సమయంలో సీనియర్ ఆటగాళ్లు ఆడాల్సిన తీరులో ఆడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఆడకుంటే ఈ మాత్రం స్కోరు కూడా దక్కే అవకాశం లేదన్ని అందరూ అంగీకరించే విషయమే. అయితే ఇది లీగ్ మ్యాచ్ కావడంతో గెలిచినా, ఓడినా సెమీస్ కు వెళతాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకున్నా, న్యూజిలాండ్ మీద మళ్లీ సీనియర్లు మొదటికొచ్చినట్లే కనిపిస్తుంది.