గువాహటి చేరుకున్న టీమిండియా.. అతడు కూడా ఉన్నాడే!

వన్డే ప్రపంచ కప్ 2023కి ముందు భారత క్రికెట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.

Update: 2023-09-28 14:58 GMT

వన్డే ప్రపంచ కప్ 2023కి ముందు భారత క్రికెట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో మొదటి వార్మప్ మ్యాచ్‌ కోసం భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ 28ను గువాహటికి చేరుకుంది. మెన్-ఇన్-బ్లూ డిఫెండింగ్ ఛాంపియన్‌ అయిన ఇంగ్లండ్ ను సెప్టెంబర్ 30న ఢీకొట్టనుంది. టీమిండియా బృందంలో అశ్విన్ కూడా ఉండడం ఆసక్తికరమైన విషయమే. ఎందుకంటే ప్రపంచ కప్ కు సెలెక్ట్ చేసిన భారత జట్టులో అశ్విన్ లేడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ODI సిరీస్‌లో అక్షర్ పటేల్‌కు బ్యాకప్‌గా అశ్విన్ జట్టులో చేరాడు. ఇప్పుడు ప్రపంచ కప్ లో తలపడే టీమ్ లో కూడా అశ్విన్ భాగమయ్యాడనే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకూ బీసీసీఐ నుండి అశ్విన్ ప్రపంచ కప్ ఆడుతాడా.. లేదా.. అనే విషయమై అధికారిక ప్రకటన రాలేదు.

ఇంగ్లండ్ తో సెప్టెంబరు 30న టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం ఈ ప్రాక్టీసు మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది. అక్టోబరు 3న తిరువనంతపురంలో జరిగే రెండో వార్మప్ మ్యాచ్ లో టీమిండియా నెదర్లాండ్స్ తో తలపడనుంది. వరల్డ్ కప్ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను అక్టోబరు 8న ఆసీస్ తో ఆడనుంది. అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.


Tags:    

Similar News