ఉమెన్ ప్రీమియర్.. వేలం అ"ధర"హో

ఉమెన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత ఆటగాళ్లకు అత్యంత డిమాండ్ ఏర్పడింది

Update: 2023-02-13 12:29 GMT

ఉమెన్ ప్రీిమియర్ లీగ్ వేలంలో భారత ఆటగాళ్లకు అత్యంత డిమాండ్ ఏర్పడింది. ముంబయిలో జరిగిన వేలంలో అత్యధికంగా భారత ఆటగాళ్లను జట్లు కొనుగోలు చేశాయి. భారత్ ఆటగాళ్లతో పాటు విదేశాలకు చెందిన బ్యాటర్లకు కూడా డిమాండ్ బాగానే ఉంది. భారత్ లో చెలరేగి ఆడుతున్న ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజెస్ ఆసక్తి చూపాయి. అందరికంటే ఎక్కువగా స్మృతి మంధానను బెంగళూరు జట్టు 3.4 కోట్లకు దక్కించుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ ను 1.8 కోట్లువెచ్చించి ముంబయి ఇండియన్స్ జట్టు తెచ్చుకుంది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లీ గార్డనర్ ను గుజరాత్ జట్టు 3.4 కోట్ల రూపాయలను వెచ్చించి సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ కు చెందిన సోఫీ డివైన్ ను బెంగళూరు జట్టు యాభై లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది.

అత్యధికంగా...
ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్ పెర్రీని బెంగళూరు జట్టు 1.7 కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ ను యూపీ వారియర్స్ 1.8కోట్లు వెచ్చించింది. భారత్ కు చెందిన దీప్తి శర్మను యూపీ వారియర్స్ 2.6 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. అలాగే ఇండియన్ ప్లేయర్ రేణుకా సింగ్ ను బెంగళూరు జట్టు 1.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ కు చెందిన నటాలీ స్కిపర్ ను ముంబయి ఇండియన్స్ జట్టు 3.2 కోట్లు పెట్టి వేలంలో కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన తహ్లియా మెక్‌గ్రాత్ ను యూపీ వారియర్స్ 1.4 కోట్లు, బెత్ మూనీనిి గుజరాత్ జెయింట్స్ రెండు కోట్లు వెచ్చించి తమ జట్టులోకి చేర్చుకుంది. భారత్ కు చెందిన రిచా ఘోష్ ను బెంగళూరు జట్టు 1.9 కోట్లకు దక్కించుకుంది. టీం ఇండియాకు చెందిన యస్తికా భాటియాను 1.5 కోట్లు ఖర్చు చేసి ముంబయి ఇండియన్స్ జట్టు తమ సొంతం చేసుకుంది.


Tags:    

Similar News