Vinesh Phogat : వినేశ్ ఫొగాట్‌కు అస్వస్థత ఆసుపత్రికి తరలింపు

భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను పారిస్ లోని ఒక ఆసుపత్రికి తరలించారు;

Update: 2024-08-07 07:57 GMT
vinesh phogat, indian wrestler,  fell ill,  hospital
  • whatsapp icon

భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను పారిస్ లోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. వినేశ్ ఫొగాట్ రాత్రంగా స్కిప్పింగ్, స్లైక్లింగ్, జాగింగ్ చేశారు. బరువు తగ్గడం కోసం వినేశ్ ఫొగాట్ రాత్రంతా మేలుకుని కసరత్తులు చేస్తూనే ఉన్నారు. దాదాపు కేజీ బరువు తగ్గిందని చెబుతున్నారు.

డీహైడ్రేషన్ కుగురై...
అయితే వినేశ్ ఫొగాట్ డీహైడ్రేషన్ కు గురి కావడంతో ఆమెను భారత అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వినేశ్ ఫొగాట్ పై ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. వినేశ్ ఫొగాట్ ఉండాల్సిన బరువు కంటే వందగ్రాములు అధికంగా ఉండటంతో ఆమెపై ఒలింపిక్స్ నిర్వాహకులు అనర్హత వేటు వేశారు


Tags:    

Similar News