గైక్వాడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కు కోటి రూపాయలిచ్చిన బీసీసీఐ

Update: 2024-07-14 08:07 GMT

క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు తక్షణమే కోటి రూపాయలను విడుదల చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జయ్ షా బోర్డును ఆదేశించారు. ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్‌ను ఆదుకునేందుకు బీసీసీఐ వేగంగా చర్యలు తీసుకుంది. వెటరన్ ప్లేయర్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు వెంటనే కోటి రూపాయలను విడుదల చేయాలని అపెక్స్ కౌన్సిల్‌ను బీసీసీఐ కార్యదర్శి జే షా ఆదేశించారు. ఆర్థిక సహాయంతో పాటు, పరిస్థితిని అంచనా వేయడానికి, అవసరమైన సహాయం అందించడానికి జే షా వ్యక్తిగతంగా గైక్వాడ్ కుటుంబాన్ని సంప్రదించనున్నారు.

అన్షుమన్ గైక్వాడ్ 1975 నుంచి 1987 వరకు సాగిన తన కెరీర్ లో 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. అలాగే భారత జట్టు హెడ్ కోచ్ గా రెండుసార్లు వ్యవహరించారు. 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడైన 71 ఏళ్ల అన్షుమన్ గైక్వాడ్ ను ఆదుకోవాలని కపిల్ దేవ్ కోరారు. ఏడాది కాలంగా గైక్వాడ్ లండన్ లోని కింగ్స్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గైక్వాడ్ వైద్య ఖర్చుల కోసం నిధులు సేకరించేందుకు మోహిందర్ అమర్ నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్ సర్కార్, మదన్ లాల్, రవి శాస్త్రి, కీర్తి ఆజాద్ శాయశక్తులా కృషి చేస్తున్నారని కపిల్ వెల్లడించారు.


Tags:    

Similar News