Kl Rahul : వేటు తప్పదా? ఫామ్ లో లేకపోవడమే కారణమా? అందుకే అలా చేశాడా?

ఇప్పటికే టీ20 జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ ఇప్పుడు టెస్ట్ జట్టుకు కూడా దూరమయ్యేటట్లే కనిపిస్తుంది

Update: 2024-10-21 12:04 GMT

Kl Rahul in t20 match

ఇప్పటికే టీ20 జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ ఇప్పుడు టెస్ట్ జట్టుకు కూడా దూరమయ్యేటట్లే కనిపిస్తుంది. పెద్దగా పరుగులు చేయకపోవడం, ఫామ్ లో లేకపోవడంతో కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి పక్కకు తప్పించడం ఖాయమన్నది క్రీడా విశ్లేషకుల అంచనా. కేఎల్ రాహుల్ స్థానంలో మరొక ఆల్ రౌండర్ ను తీసుకుంటే మేలన్న నిర్ణయానికి జట్టు టీం వచ్చినట్లు తెలిసింది. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో కేఎల్ రాహుల్ పెద్దగా గేమ్ లో రాణించలేకపోయారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అంతే. సెకండ్ ఇన్నింగ్స్ లో పన్నెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. కేఎల్ రాహుల్ నిలకడగా ఆడి ఉంటే భారత్ తొలి మ్యాచ్ ఓటమి పాలయ్యేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.

ఫామ్ కోల్పోయి...
కేఎల్ రాహుల్ కొద్ది కాలం నుంచి ఫామ్ కోల్పోయి ఉన్నారు. ఇప్పటికే టీ 20 జట్టు నుంచి రాహుల్ దూరమయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ కేవలం టెస్ట్, వన్డే మ్యాచ్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సర్ఫరాజ్ ఖాన్ రావడంతో పాటు పంత్ కూడా ఉండటంతో మరో ఆల్ రౌండర్ కు చోటు కల్పించడం మేలన్న అభిప్రాయం అందరి నోటా వినిపిస్తుంది. రెండో టెస్ట్‌లోనే కేఎల్ రాహుల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే తొలి మ్యాచ్ లో ఓటమి పాలయిన భారత్ జట్టు రెండో మ్యాచ్ లో గెలవాలని భావిస్తుంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ను తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వరస వైఫల్యాలు...
వరస వైఫల్యాలు అతనిని జట్టు నుంచి తప్పించడానికి ప్రధాన కారణమవుతాయని చెప్పక తప్పదు. కేఎల్ రాహుల్ కు క్రికెట్ లో స్టయిలిష్ బ్యాట్స్‌మెన్ గా పేరుంది. ఒకప్పుడు కేఎల్ రాహుల్ పై నమ్మకం ఉండేది. కనీస పరుగులు చేస్తారన్న విశ్వాసం ఆయన ఆటలో కనిపించేది. కేఎల్ రాహుల్ ఉన్నాడన్న ధైర్యం ఇప్పుడు టీంకు పోయింది. మేనేజ్‌మెంట్‌కు పోయింది. న్యూజిలాండ్ తో జరిగిన ఆటలో భారత్ ఓటమికి కేఎల్ రాహుల్ ది పూర్తి బాధ్యత కాకపోయినా కానీ రాహుల్ పై మాత్రం వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను తీసుకోనున్నారు. అందుకే కేఎల్ రాహుల్ బెంగళూరు టెస్ట్ ముగిసిన తర్వాత పిచ్ ను ముద్దు పెట్టుకున్నారని అంటారు. మొత్తం మీద ఒకప్పుడు కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నాడంటే ఉండే ధైర్యం ఇప్పుడు లేకపోవడం వల్లనే ఉద్వాసన పలుకుతున్నట్లు సమాచారం.


Tags:    

Similar News