IPL 2025 : కాటేరమ్మ కొడుకులకు షాక్ ఇచ్చిన లక్నో

ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విజయం సాధించింది.;

Update: 2025-03-28 01:48 GMT
lucknow super giants, hyderabad sunrisers, uppal, IPL 2025
  • whatsapp icon

ఉప్పల్ స్టేడియం అంటే ఊగిపోవడమే. రికార్డులు బద్దలు కొట్టేయడమే. మొదట బ్యాటింగ్ కు దిగితే ఈసారి మూడు వందలు గ్యారంటీ.. ఇలాంటి అంచనాలన్నీ ఐపీఎల్ హైదరాబాద్ సన్ రైజర్స్ టీంపై ఎక్కువగా వినిపించాయి. కనిపించాయి. కానీ నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కలలు చెదిరిపోయియాయి. రికార్డులు కాదు కాదు. అట్టర్ ప్లాప్ షో సన్ రైజర్స్ నుంచి చూడాల్సి వచ్చింది. ఫ్యాన్స్ కు ఇది కొంత కష్టంగానే ఉన్నా నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజరైజర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. మామూలుగా కాదు.. అలవోకగా. తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ టీంను కట్టడి చేసి 190 పరుగులకే పరిమితం చేసి దానిని సులువుగా లక్నో అధిగమించింది.

అట్టర్ ప్లాప్ షో...
సన్ రైజర్స్ ను సొంత గడ్డపైన లక్నో సూపర్ సూపర్ జెయింట్స్ దారుణంగా దెబ్బతీసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టులో హెడ్ మినహా ఎవరూ సక్రమంగా ఆడలేకపోయారు. నిలవలేకపోయారు. అనేకంటే వారిని క్రీజులో ఉంచేందుకు లక్నో బౌలర్లు ఇష్టపడలేదంటే బాగుంటుంది. ఎందుకంటే వచ్చిన వారిని వచ్చినట్లే వెనక్కు పంపుతుండటంతో చివకు 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులను సన్ రైజర్స్ చేయగలిగింది. హెడ్ 47 పరుగులు, అనికేత్ వర్మ 36, నితీష్ ుమార్ రెడ్డి 32 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన వారు తక్కువ పరుగులకే అవుటయ్యారు. శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీసి సన్ రైజర్స్ ను దెబ్బతీశాడు. దిగ్వేష్, రవి విష్ణోయ్, ప్రిన్స్ తలో వికెట్ తీసి తక్కువ పరుగులకే సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ను ముగించారు.
అలవోకగా...
అయితే తర్వాత ఛేదనలో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ అసలు ఏ బంతికి జడుసుకోలేదు. భయపడలేదు. షాట్లు కొట్టి సిక్సర్లు బాది మీకే కాదు మాకు కూడా చేతవు అని నిరూపించింది. సొంత మైదానంలోనే సన్ రైజర్స్ ను దారుణంగా దెబ్బతీసింది. మిచెల్ మార్ష్ 52 పరుగులు, పూరన్ 70 పరుగులు చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం తొలి పది ఓవర్లలోనే ఖాయమయింది. 16. 4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి 193 పరుగులను లక్నో సూపర్ జెయింట్స్ చేయగలిగింది. షమి, కమిన్స్ రెండు, జంపా ఒకటి వికెట్ తీసినా అప్పటికే జెయింట్స్ విజయం చేరువలోకి రావడంతో దానిని ఎవరూ ఆపలేకపోయింది. ఫలితంగా నిన్న ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విజయం సాధించింది.


Tags:    

Similar News