IPL 2025 : గుజరాత్ కు ఎదురుదెబ్బ.. లక్నోకు సొంత గడ్డపై సూపర్ విక్టరీ
లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్ ను ఓడించి విజయకేతనం ఎగురవేసింది;

ఐపీఎల్ లో ఎప్పుడు ఏ జట్టు అనూహ్యంగా పుంజుకుంటుందో చెప్పలేం. నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయ యాత్రకు బ్రేక్ పడింది. లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్ ఓడించి విజయకేతనం ఎగురవేసింది. తక్కువ స్కోరు కాకపోయినా పూనమ్ పూనకాలతో చెలరేగిపోవడంతో పాటు మార్ క్రమ్ రెచ్చిపోవడంతో గుజరాత్ టైటాన్స్ చేసిన స్కోరు చిన్న బోయింది. సొంతగడ్డ మీద తమ చేవ తగ్గలేదని లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి నిరూపించింది. వరసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు మార్చి చూసినా ఫలితం కనిపించలేదు. ఆ బౌలర్లను ఒక ఉతికి ఉతికిపారేశారు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు.
ఓపెనర్లిద్దరూ...
తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ లో ఎప్పటిలాగానే సుదర్శన్ సూపర్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. సుదర్శన్ 56 పరుగులు చేశాడు, శుభమన్ గిల్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ అరవై పరుగులు చేశఆడు. తర్వాత ఎవరూ పెద్దగా నిలబడలేదు. బట్లర్ పదహారు పరుగులకే అవుటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ రెండు పరుగులకే వెనుదిరిగాడు. రూథర్ ఫర్డ్ మాత్రం 22 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. షారూక్ నాటౌట్ గా నిలిచి 11 పరుగులు చేశాడు. తెవాతియా డకౌట్ అయ్యాడు. మొత్తం ఇరవై ఓవర్లకు గాను గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. శార్దూల్ రెండు, దిగ్వేశ్, ఆవేశ్ ఖాన్ తలో ఒక వికెట్ తీయగా, బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగలిగాడు.
అలవోకగా ఛేదించి...
ఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు ఇద్దరూ మంచి పెర్ ఫార్మెన్స్ చూపారు. మార్ క్రమ్ 58 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 22 పరుగుల వద్ద అవుటయినా తర్వాత స్థానంలో వచ్చిన పూరన్ ఇక విజృంభించాడు. సిక్సర్లు, ఫోర్లతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఒక ఉతుకు ఉతికాడు. పూరన్ 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికే మ్యాచ్ లక్నో వైపు మళ్లింది. బదోని నాటౌట్ గా నిలిచి 28 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ రంెడు వికెట్లు, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ లు చెరో వికెట్ మాత్రమే తీయగలగలిగారు. దీంతో 19.3 ఓవర్లలోనే లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్ మీద 186 పరుగులు చేసి విజయం సాధించింది.