IPL 2025 : ఐపీఎల్ లో నేడు అదిరిపోయే మ్యాచ్
నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.;

ఐపీఎల్ లో నేడు మరో ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరగనుంది. రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించింది. 284 పరుగుల చేయగలిగింది.
పరుగుల వరద....
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారే అవకాశముంది. అదే సమయంలో ఇరు జట్లు సమానమైన బలం ఉండటంతో హోరా హోరీ పోరు జరిగే అవకాశం ఉంది. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియంతో మోత మోగనుంది. మరోవైపు హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుండటంతో టీజీ ఆర్టీసీ ఆరవై ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసింది. ఫ్యాన్స్ ఇప్పటికే ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవడంతో ఉప్పల్ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయే అవకాశముది.