భారత జట్టు మాజీ క్రికెటర్ తల్లి అలా పడి ఉండడం చూసి!

మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా తల్లి;

Update: 2024-10-04 16:57 GMT
salil, salilankola, ankola, salilmother, mala ashok ankola mother dies in Pune, teamindiacricketer, Indiancricketer

 salilankola, mala ashok ankola  

  • whatsapp icon

మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా తల్లి శుక్రవారం పూణె నగరంలోని ప్రభాత్ రోడ్ ప్రాంతంలోని తన నివాసంలో శవమై కనిపించారు. మృతురాలిని మాల అశోక్ అంకోలా (77)గా పోలీసులు గుర్తించారు. రేగే పాత్‌లోని అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో మాలా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అపార్ట్‌మెంట్ ఆమె కుమార్తె పేరు మీద రిజిస్టర్ చేశారు. ఆమె కూడా సమీపంలోనే ఉంటోంది. తరచుగా ఆమె తల్లి ఫ్లాట్‌కు వస్తూ ఉంటుంది. ఉదయం 11 గంటల సమయంలో ఇంటి పనిమనిషి వచ్చినా మాలా ఇంటి తలుపు తీయలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మాల స్పందించకపోవడంతో ఇంటి పనిమనిషి మాలా కుమార్తెను సంప్రదించింది. మాలా కూతురు ఇంటి తాళాలు ఇచ్చి ఓ వ్యక్తిని పంపింది.  పనిమనిషి సెక్యూరిటీ గార్డుతో కలిసి లోపలికి వెళ్లి చూడగా మాల తన మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉంది. మాలా మెడపై గాయాలు ఉన్నాయని సెక్యూరిటీ గార్డు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న డెక్కన్ పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మృతురాలు గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నామని, అయితే ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

సలీల్ అంకోలా మహారాష్ట్ర జట్టు తరపున తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. సచిన్ టెండూల్కర్ తో కలిసి నవంబర్ 15, 1989న భారతదేశం తరపున తన టెస్టు అరంగేట్రం చేశాడు. అంకోలా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ తీసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఆ సంవత్సరం తరువాత, వన్డే ఇంటర్నేషనల్స్ కూడా ఆడాడు. 1996 ప్రపంచ కప్‌లో భారత జట్టులో భాగమయ్యాడు. 1997లో కణితి కారణంగా 29 సంవత్సరాల వయస్సులోనే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది.


Tags:    

Similar News