ఇంకో షాక్.. షమీ, దీపక్ చాహర్ అవుట్

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా..;

Update: 2023-12-16 08:12 GMT
team india, indian cricket team, INDvsSA, SAvsIND, shami, deepak chahar, mohammed shami

mohammed shami, deepak chahar

  • whatsapp icon

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా.. ఈ విషయంలో టీమిండియాకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో అదరగొట్టిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. షమీ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ మెడికల్ టీమ్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో అతడు టెస్టు సిరీస్‌కు దూరమవనున్నాడని బీసీసీఐ హానరరీ సెక్రటరీ జై షా తెలిపారు. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండలేనని దీపక్ చాహర్ తెలియజేశాడు. అతడి స్థానంలో ఆకాష్ దీప్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని వివరించారు. డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్‌కు షురూ కానుంది.


Full View



భారత ‘ఏ‘ జట్టు కోచింగ్ స్టాఫ్ వన్డే జట్టుకు సహాయం అందిస్తారు. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్ రాజీబ్ దత్తా, ఫీల్డింగ్ కోచ్ అజయ్ జట్టుతో ఉంటారు. ఇక టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ టెస్టు జట్టుతో కలుస్తారని బీసీసీఐ ప్రకటించింది. డిసెంబరు 17న జోహన్నెస్‌బర్గ్‌లో తొలి వన్డే ముగిసిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు టెస్టు జట్టుతో కలవనున్నాడు.


Tags:    

Similar News