వికెట్లు.. క్యాచ్ లు.. వావ్ ఆటంటే... ఇది

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఛేదనలో చేతులెత్తేసింది. చివరి టీ 20 మ్యాచ్ చప్పగా సాగింది.

Update: 2023-02-02 02:38 GMT

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఛేదనలో చేతులెత్తేసింది. చివరి టీ 20 మ్యాచ్ చప్పగా సాగింది. భారత్ కు భారీ విజయం దక్కింది. మూడో టీ 20లో విజయం సాధించడమే కాకుండా సిరీస్ ను కూడా భారత్ దక్కించుకుంది. శుభమన్ గిల్ 126 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఏడు సిక్సర్లు, పన్నెండు ఫోర్లతో న్యూజిలాండ్ పై శుభమన్ గిల్ విరుచుకుపడ్డాడు. తొలి రెండు టీ 20లలో విఫలమయిన రాహుల్ త్రిపాఠీ సయితం 44 పరుగులు చేశాడు. దీంతో భారత్ భారీ స్కోరు చేసింది.

భారీ స్కోరు ను...
20 ఓవర్లలో 234 పరుగులు చేసిన భారత్ న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే వికెట్లను టపా టపా వికెట్లను చేజార్చుకుంటుంది. ఏ ఒక్క బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ మూడు అద్భుతమైన క్యాచ్ లను పట్టడంతో న్యూజిలాండ్ ఇంటి బాట పట్టింది. హార్థిక్ పాండ్యాకు నాలుగు వికెట్లు దక్కాయి. అర్హదీప్ సింగ్ రెండు, ఉమ్రాన్ మాలిక్ రెండు, శివమ్ మావికి రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ వెన్ను విరిచారు. దీంతో భారత్ సిరీస్ దక్కించుకుంది. 168 పరుగుల తేడాతో న్యూజిలాడ్ ఓటమి పాలయింది.


Tags:    

Similar News