బంగ్లాదేశ్ పై నెగ్గిన పాక్

ఆసియాకప్ 2023 టోర్నీలో సూపర్ 4లో పాకిస్థాన్ విజయం సాధించింది.

Update: 2023-09-06 17:10 GMT

ఆసియాకప్ 2023 టోర్నీలో సూపర్ 4లో పాకిస్థాన్ విజయం సాధించింది. సూపర్-4 తొలి మ్యాచ్‍లో బంగ్లాదేశ్‍పై గెలిచింది పాక్. లాహోర్‌లో సూపర్-4 తొలి మ్యాచ్‍లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‍పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. షకీబుల్ హసన్ (57 బంతుల్లో 53 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (87 బంతుల్లో 64 పరుగులు) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. పాకిస్థాన్ బౌలర్లలో హరిస్ రవూఫ్ నాలుగు వికెట్లను తీయగా. సనీమ్ షా మూడు పడగొట్టాడు.

ఇక స్వల్ప లక్ష్యాన్ని 10.3 ఓవర్లు మిగిలి ఉండగానే పాకిస్థాన్ ఛేదించింది. 39.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్ 84 బంతుల్లో 78 పరుగులు చేశాడు. మహమ్మద్ రిజ్వాన్ 79 బంతుల్లో 63 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షఫియుల్ ఇస్లాం, మెహదీ హసన్ మిరాజ్‍కు చెరో వికెట్ దక్కింది. ఆసియాకప్ 2023 టోర్నీలో మిగిలిన మ్యాచ్‍లన్నీ శ్రీలంక వేదికగా జరగనున్నాయి.


Tags:    

Similar News