ENGvsPAK: ఫ్లాట్ పిచ్ సిద్ధం చేసుకుని.. బొక్క బోర్లా పడ్డ పాకిస్థాన్

స్వదేశంలో ఇంగ్లండ్ ను ఢీకొట్టడానికి ఫ్లాట్ పిచ్ సిద్ధం చేసుకున్న పాకిస్థాన్;

Update: 2024-10-10 11:12 GMT
PAKvsENG, HarryBrook, Brook, JoeRoot, ENGvsPAK 1st Test - Live Cricket Score harry brook triple century, latest cricket news telugu

ENGvsPAK 

  • whatsapp icon

స్వదేశంలో ఇంగ్లండ్ ను ఢీకొట్టడానికి ఫ్లాట్ పిచ్ సిద్ధం చేసుకున్న పాకిస్థాన్ కు ఆ జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ, జో రూట్ డబులు సెంచరీ బాదడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. గత 34 సంవత్సరాలలో (1990 నుండి) ట్రిపుల్ సెంచరీ కొట్టిన ఇంగ్లండ్ క్రికెటర్ గా బ్రూక్ నిలిచాడు. మొత్తం మీద టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆరో ఇంగ్లీష్ బ్యాటర్ అయ్యాడు. భారతజట్టు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీని బ్రూక్ సాధించాడు. సెహ్వాగ్ 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ చేస్తే బ్రూక్ తన ట్రిపుల్ సెంచరీని చేరుకోవడానికి 310 బంతులు తీసుకున్నాడు.

బ్రూక్ 317 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇంగ్లండ్ స్కోరు బోర్డ్‌లో 823/7 భారీ స్కోరు నమోదు చేసిన తర్వాత తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఏకంగా 267 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో పాక్ 556 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. సెకండ్ ఇన్నింగ్స్ లో 59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది. పాక్ జట్టుకు ఫ్లాట్ పిచ్ మీద కూడా ఓటమి తప్పదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.


Tags:    

Similar News