కన్నుమూసిన ప్రముఖ రెజ్లర్, పొలిటీషియన్

1976లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్‌లో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ ముహమ్మద్ అలీతో తలపడిన ప్రముఖ జపనీస్ ప్రొఫెషనల్ రెజ్లర్

Update: 2022-10-01 07:57 GMT

1976లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్‌లో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ ముహమ్మద్ అలీతో తలపడిన ప్రముఖ జపనీస్ ప్రొఫెషనల్ రెజ్లర్, రాజకీయ నాయకుడు 'ఆంటోనియో ఇనోకి' మరణించారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. అమిలోయిడోసిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న ఇనోకి శనివారం నాడు మరణించారు. వ్యాధితో పోరాడే సమయంలో ఇనోకి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు.

ఇనోకి జపనీస్ ప్రో-రెజ్లింగ్‌కు మంచి పేరును తీసుకుని వచ్చారు. జూడో, కరాటే, బాక్సింగ్ వంటి ఇతర క్రీడల నుండి అగ్రశ్రేణి రెజ్లర్లు, ఛాంపియన్‌ల మధ్య మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్‌లను ప్రారంభించారు. ఈ ఫీల్డ్ నుండి రాజకీయాల్లోకి వచ్చిన మొదటి క్రీడాకారుడు కూడా ఆయనే. క్రీడల ద్వారా శాంతిని ప్రోత్సహించారు. శాంతి, స్నేహాన్ని ఏర్పరుచుకోవాలనే ఆశతో అతను చట్టసభ సభ్యుడుగా ఉన్న సమయంలో ఉత్తర కొరియాకు 30 కంటే ఎక్కువ పర్యటనలకు వెళ్లారు.
మెడపై ఎరుపు రంగు స్కార్ఫ్ తో కనిపించే ఇనోకి.. చివరిసారిగా ఆగస్టు నెలేలో వీల్ చైర్‌లో టీవీ షోలో కనిపించారు. ఆయన పబ్లిక్ గా కనిపించడం అదే ఆఖరు. యోకోహామాలో 1943లో కంజి ఇనోకిగా జన్మించిన అతను 13 సంవత్సరాల వయస్సులో తన కుటుంబంతో కలిసి బ్రెజిల్‌కు వెళ్లి కాఫీ తోటలో పనిచేశాడు. విద్యార్థిగా ఉన్న సమయంలో షాట్‌పుట్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. 17 సంవత్సరాల వయస్సులో ప్రొఫెషనల్ రెజ్లర్‌గా అరంగేట్రం చేశాడు. అక్కడ అతను జపనీస్ ప్రో-రెజ్లింగ్ లెజెండ్ అయిన 'రికిడోజాన్' దృష్టిని ఆకర్షించాడు. ఇనోకి 1960లో ప్రో-రెజ్లింగ్ లో అరంగేట్రం చేసాడు. రెండు సంవత్సరాల తర్వాత 'ఆంటోనియో ఇనోకి' అనే రింగ్ నేమ్ పెట్టుకున్నాడు. "జెయింట్" బాబాతో కలిసి ఇనోకి ప్రో-రెజ్లింగ్‌ను జపాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా మార్చాడు. ఇనోకి 1972లో న్యూ జపాన్ ప్రో-రెజ్లింగ్‌ను స్థాపించారు. 1976లో టోక్యోలోని బుడోకాన్ హాల్‌లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్‌లో అలీని ఎదుర్కొన్నప్పుడు ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఇనోకి 1989లో జపాన్ పార్లమెంటులోకి ప్రవేశించారు. స్పోర్ట్స్ అండ్ పీస్ పార్టీకి నాయకత్వం వహించారు. 1990లో ఇరాక్‌లో బందీలుగా ఉన్న జపాన్ పౌరులను విడుదల చేయించారు.


Tags:    

Similar News