Rahul Dravid: దటీజ్ రాహుల్ ద్రావిడ్.. కోట్ల డబ్బులు వద్దన్నాడు!!

T20 ప్రపంచ కప్ విజయం తర్వాత భారత క్రికెట్ బోర్డు అందించిన

Update: 2024-07-10 05:24 GMT

T20 ప్రపంచ కప్ విజయం తర్వాత భారత క్రికెట్ బోర్డు (BCCI) అందించిన రూ. 2.5 కోట్ల అదనపు బోనస్‌ను హెడ్ కోచ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ తిరస్కరించారు. దీంతో రాహుల్ ద్రావిడ్ గొప్ప మనసు గురించి ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. తన డబ్బును సీనియర్ పురుషుల జట్టులోని సహాయక సిబ్బంది సభ్యులందరికీ సమాన బోనస్ గా అందజేయాలని ద్రవిడ్ కోరారు.

ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సహా టీమిండియా సభ్యులకు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఆటగాళ్లకు, రాహుల్ ద్రవిడ్‌కు రూ. 5 కోట్లు, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ సహా ఇతర సహాయక సిబ్బందికి రూ.2.5 కోట్లు బోనస్‌గా అందజేయనున్నారు. అయితే బోనస్‌గా కేవలం రూ. 2.5 కోట్లు మాత్రమే తీసుకుంటానని రాహుల్ ద్రవిడ్ బోర్డుకు తెలిపినట్లు ఇండియా టుడే కథనాన్ని ప్రచురించింది. జట్టులో భాగమైన 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల రివార్డు లభించింది. సహాయక సిబ్బందికి రూ. 2.5 కోట్లు లభించగా, సెలెక్టర్లు, ట్రావెలింగ్ రిజర్వ్ లకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు దక్కింది. జూలై 4న ముంబైలో జరిగిన విజయోత్సవ పరేడ్ తర్వాత బీసీసీఐ కార్యదర్శి జే షా, అధ్యక్షుడు రోజర్ బిన్నీ జట్టుకు ప్రైజ్ మనీని అందజేశారు.


Tags:    

Similar News