IPL 2025 : చెన్నై పై బెంగళూరు సూపర్ విక్టరీ.. పదిహేడేళ్ల నిరీక్షణ చెపాక్ లో ఫలించిందిగా
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీం విజయం సాధించింది.;

చాలా రోజులకు ఒక విజయం, సుదీర్ఘకాలం తర్వాత విక్టరీ. అదీ బ్యాక్ టు బ్యాక్ విజయం. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు దక్కిన అపురూపమైన గెలుపు. ఎందుకంటే చెన్నైలో ఇప్పటి వరకూ విజయం కోసం వేచి చూడటమే తప్ప గెలిచింది లేదు. ఛాంపియన్స్ ట్రోఫీని సాధించినంత సంబరపడింది టీమంతా. నిన్న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీం విజయం సాధించింది. కానీ పెద్దగా టెన్షన్ లేకుండానే మ్యాచ్ ముగిసింది. దీనికి ప్రధాన కారణం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ లోని బ్యాటర్లు.. బౌలర్లు. ఇలా ఒక మ్యాచ్ పై గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ గెలిచి సంబరాలు చేసుకున్నారంటే దానికి అది పెద్ద విజయమనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు పదిహేడేళ్ల నుంచి ఈ గెలుపు కోసం టీమంతా ఎదురు చూస్తుంది. కానీ దక్కలేదు. చివరకు ఎట్టకేలకు విజయం సులువుగా తమ ఖాతాలో పడింది.