నేడు ఇండియా - శ్రీలంక రెండో టెస్ట్
భారత్ - శ్రీలంక మధ్య నేడు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో రెండో టెస్ట్ జరగనుంది
భారత్ - శ్రీలంక మధ్య నేడు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో రెండో టెస్ట్ జరగనుంది. డే అండ్ నైట్ మ్యాచ్ కావడతో పింక్ బాల్ ను వినియోగిస్తున్నాు. ఇప్పటికే ఒక టెస్ట్ మ్యాచ్ ను గెలిచి ఊపు మీదున్న భారత్ రెండో మ్యాచ్ గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉంది. అదే సమయంలో శ్రీలంక ఆటగాళ్లు వరసగా గాయాలు పాలు కావడం ఆ జట్టును కలవరపరస్తుంది.
బలంగా భారత్...
భారత్ అన్ని రంగాల్లో బలంగా ఉంది. రవీంద్రా జడేజా ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు. అశ్విన్ మాయాజాలంతో విక్కెట్లను దక్కించుకుంటన్నాడు. బ్యాటింగ్ లోనూ అందరూ రాణిస్తున్నారు. రోహిత్, మయాంక్, హనుమ విహారి, కొహ్లి, శ్రేయస్ అయ్యర్, పంత్ ఇలా చెప్పుకుంటూ పోతే బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది.
రోహిత్ రికార్డులు...
దీంతో శ్రీలంక జట్టును ఎటు చూసినా బలహీనంగానే కనపడుతుంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ అనేక రికార్డులను అధిగమించనున్నారు. రోహిత్ ఈ మ్యాచ్ తో అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయంగా 400 మ్యాచ్ లను పూర్తి చేయనున్నాడు. మరో మూడు క్యాచ్ లు పడితే టెస్ట్ మ్యాచ్ లలో యాభై క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా రికార్డు నమోదు చేస్తాడు.