Champions Trophy : నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య సెమీ ఫైనల్స్
భారత్ - ఆస్ట్రేలియా మధ్య నేడు ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది.;

భారత్ - ఆస్ట్రేలియా మధ్య నేడు ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ మూడు వరస విజయాలతో గెలిచి మంచి ఫామ్ లో ఉంది. సీనియర్లు తడబడుతున్నప్పటికీ కుర్రోళ్లు ఆడుతూ విజయాలను అందిస్తున్నారు. అదే సమయంలో అన్ని ఫార్మాట్లలో భారత్ బలంగా ఉంది. ప్రధానంగా బ్యాటింగ్, బౌలింగ్ లలో తన సత్తా చాటుతూ సెమీ ఫైనల్స్ వరకూ దూసుకు వచ్చింది.
ఆస్ట్రేలియా విషయం మాత్రం...
ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఏమాత్రం అంచనాలు లేకుండా కొత్త ఆటగాళ్లతో ఛాంపియన్స్ ట్రోఫీలోకి ప్రవేశించింది. కీలక ఆటగాళ్లందరూ గాయాలపాలు కావడంతో తొలుత ఇబ్బందులు పడినా తర్వాత ఆ జట్టు కూడా ఫామ్ లోకి వచ్చింది. గతంలోనూ ఆస్ట్రేలియా భారత్ ను ఐసీసీ ట్రోఫీలో ఓడించింది. దీంతో మరోసారి ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఇరు జట్ల ఫ్యాన్స్ లో నెలకొంది.