Aswin : భావోద్వేగానికి గురైన అశ్విన్
సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు
సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ ముగిసిన అనంతరం ఆయన ఈ నరి్ణయం తీసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ చేయి తిరిగిన స్పిన్నర్. ఇప్పటికే అశ్విన్ తన కెరీర్ లో అత్యధికంగా 106 టెస్ట్ లు ఆడాడు. 537 వికెట్లు తీశాడు. 3,503 పరుగులు చేశాడు. భారత్ క్రికెట్ లో తనను భాగస్వామ్యం చేసినందుకు ఆనందంగా ఉందని అశ్విన్ తెలిపారు.
రిటైర్ మెంట్ ప్రకటించిన తర్వాత...
తన రిటైర్ మెంట్ సందర్భంగా అశ్విన్ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. భారత్ తరుపున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నానని అశ్విన్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన అనంతరం రేపు భారత్ కు రానున్నాడు. అశ్విన్ కేవలం బౌలింగ్ పరంగా మాత్రమే కాకుండా బ్యాటింగ్ పరంగా కూడా భారత్ కు అండగా నిలిచాడు. ఆయన ఎన్నోసార్లు భారత్ ను గట్టెక్కించాడు. ఆల్ రౌండర్ గా పేరు పొందాడు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now