కెప్టెన్ గా శిఖర్ ధావన్.. ప్రపంచకప్ కు వెళ్ళేది వాళ్లేనా..?

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వబడింది.

Update: 2022-07-06 10:53 GMT

ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వబడింది. వీరందరూ ఆసియా కప్‌లో తిరిగి భారతజట్టులోకి రావచ్చు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న T20I ప్రపంచకప్‌కు దాదాపు 3 నెలల సమయం ఉండటంతో, ఇంగ్లండ్‌తో ఆడబోయే మూడు T20Iల మ్యాచ్ లలో ఒక కోర్ గ్రూప్‌ను ఉంచడానికి భారత సెలెక్టర్ల వేట కొనసాగుతోంది. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత, వెస్టిండీస్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న భారత జట్టులో ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్లతో ప్రపంచ కప్ కు వెళ్లే జట్టుకు ఖరారు చేయాలని భావిస్తున్నారు సెలెక్టర్లు.

వెస్టిండీస్ పర్యటనలో వెటర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్‌గా నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటన కోసం మొత్తం 16 మందితో జట్టును ప్రకటించింది. భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ఆవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్


Tags:    

Similar News