రోహిత్ శర్మ-రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా గ్రౌండ్ లోకి వచ్చిన పాము
ఈ మ్యాచ్ లో భారత్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. వికెట్ పడకుండా పవర్ ప్లే ఆడడమే కాకుండా..
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు గువాహటిలో రెండో టీ20 మ్యాచ్ జరుగుతూ ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. తొలి టీ20లో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగింది. దక్షిణాఫ్రికా జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. స్పిన్నర్ తబ్రైజ్ షంసీ స్థానంలో ఎంగిడీని తుదిజట్టులోకి తీసుకున్నట్టు సఫారీ కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో టీమిండియా తొలి మ్యాచ్ లో నెగ్గి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్ లో భారత్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. వికెట్ పడకుండా పవర్ ప్లే ఆడడమే కాకుండా.. భారీ స్కోరు సాధించడానికి పునాది వేశారు. మ్యాచ్ లో ఆసక్తికరమైన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ- రాహుల్ బ్యాటింగ్ చేస్తూ ఉండగా పాము గ్రౌండ్ లో కనిపించింది. దీంతో ఆటగాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు. భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న ఏడో ఓవర్ లో పాము కనిపించింది. దీంతో మ్యాచ్ ను ఆపేశారు. గ్రౌండ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పామును పట్టేసుకున్నారు. ఎవరికీ ఎటువంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.