మెయిన్ లీగ్ కు అర్హత సాధించిన శ్రీలంక

Update: 2022-10-20 07:56 GMT

టీ20 ప్రపంచ కప్ లో శ్రీలంక కీలకమైన విజయాన్ని నమోదు చేసుకుంది. నెదర్లాండ్స్ పై 16 పరుగుల తేడాతో విజయం సాధించి మెయిన్ లీగ్ లోకి అర్హత సాధించింది. ఫస్ట్ రౌండ్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో నమీబియా చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో ఆ తర్వాతి రెండు మ్యాచ్ లు తప్పక గెలవాల్సి వచ్చింది. యుఏఈపై రెండో మ్యాచ్ లో గెలిచిన శ్రీలంక.. మూడో మ్యాచ్ లో కూడా రాణించింది. నెదర్లాండ్స్ పై 16 పరుగులతో విక్టరీని సాధించి రెండో రౌండ్ కు అర్హత సాధించింది. తమ ప్రారంభ గేమ్‌లో నమీబియాపై షాకింగ్ ఓటమిని చవిచూసిన ఆసియా కప్ ఛాంపియన్ శ్రీలంక UAEపై అద్భుతమైన విజయంతో పుంజుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో మంచి ఆటతీరును కనిపించి సూపర్-12 లోకి అడుగుపెట్టింది.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ 79 పరుగులతో రాణించడంతో శ్రీలంకకు మంచి స్కోర్ లభించింది. అసలంక 31 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఛేజింగ్ లో నెదర్లాండ్స్ 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ తరపున మ్యాక్స్ ఓ దౌడ్ 71 పరుగులతో రాణించాడు. ఆఖర్లో వికెట్లు పడిపోవడం.. మ్యాక్స్ కు సహకారం లభించకపోవడంతో నెదర్లాండ్స్ కు ఓటమి ఎదురైంది.


Tags:    

Similar News