సూర్య... ఓ సంచలనం రికార్డు బ్రేక్

సూర్య కుమార్ యాదవ్ మరో రికార్డును అధిగమించాడు. ఈ సంవత్సరం ఇప్పటికే సూర్య టీ 20 మ్యాచ్ లలో 732 పరుగులు చేశాడు.

Update: 2022-09-29 07:03 GMT

సూర్యకుమార్ యాదవ్ టీం ఇండియాకు ఒక ధైర్యం. మిస్టర్ 360 గా సూర్యకుమార్ గ్రౌండ్ లో చెలరేగి ఆడుతుంటే చూసే వారికి రెండు కళ్లు చాలవు. సిక్సర్ లు బాదటం అంటే ఎంత సులువో సూర్యకుమార్ ను చూసి నేర్చుకోవాలంటారు. ఇప్పుడు సూర్యకుమార్ ఫుల్ ఫాం లో ఉన్నాడు. టీ 20 మ్యాచ్ లలో కీలక భూమిక పోషిస్తున్నారు. భారత్ విజయాల్లోనూ సూర్య పాత్ర అమోఘమని క్రీడా పండితులు సయితం విశ్లేషిస్తున్నారు.

లేటుగా వచ్చినా...
ఐపీఎల్ లో సత్తా చాటిన సూర్యకుమార్ యాదవ్ కొంచెం లేటుగా టీం ఇండియా జట్టులోకి ప్రవేశించాడు. రికార్డులను బద్దలు కొడుతున్నాడు. సూర్య కుమార్ యాదవ్ ఫోర్త్ డౌన్ లో దిగుతాడు. అంతకు ముందు రోహిత్, కొహ్లి అవుట్ అయితే టీం ఇండియా విజయంపై అనుమానాలుండేవి. కానీ సూర్యకుమార్ యాదవ్ ఉండటంతో అభిమానుల్లో ఒక భరోసా ఏర్పడింది. కొన్ని మ్యాచ్ లలో త్వరగా అవుటవుతున్నా ఎక్కువ మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసి అభిమానుల సంఖ్యను రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నాడు.
మిస్టర్ 360 గా...
ఇంగ్లండ్ పై ఇటీవల జరిగిన టీ 20 మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్117 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లలోనూ సూర్య రాణించాడు. సూర్యకుమార్ నిలదొక్కుకుంటే పరుగుల వరదే నన్నది అభిమానుల నమ్మకం. విశ్వాసం కూడా. అంతే వేగంగా అర్థసెంచరీని కూడా సూర్య కుమార్ యాదవ్ పూర్తి చేయగలడు. ఏ దిశ నుంచైనా షాట్ కొట్టే సత్తా సూర్య కుమార్ యాదవ్ సొంతం.
రికార్డులు బద్దలు...
ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ మరో రికార్డును అధిగమించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో యాభై పరుగులు చేసిన సూర్య ఒక క్యాలండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సంవత్సరం ఇప్పటికే సూర్య టీ 20 మ్యాచ్ లలో 732 పరుగులు చేశాడు. శిఖర్ థావన్, విరాట్ కొహ్లి రికార్డులను అధిగమించాడు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే సూర్య కుమార్ యాదవ్ 45 సిక్సర్లు బాదాడు. ఇది కూడా రికార్డే. గత ఏడాది రిజ్వాన్ 42 సిక్సర్లు, గప్తిల్ 41 సిక్సర్లను సూర్యకుమార్ ఈ ఏడాది దాటేశాడు. దటీజ్ సూర్య.. ఆల్ ది బెస్ట్ సూర్యకుమార్.


Tags:    

Similar News