India Vs Bangladesh : క్లీన్ స్వీప్ చేసిన టీం ఇండియా.. జీరోతో బంగ్లా ఇంటికే

పాకిస్థాన్ ను ఇటీవల ఓడించి మంచి ఊపు మీదున్న బంగ్లాదేశ్ ను టీం ఇండియా రెండు టెస్ట్ మ్యాచ్‌లలోనూ ఓడించింది

Update: 2024-10-01 12:13 GMT

team india 

పాకిస్థాన్ ను ఇటీవల ఓడించి మంచి ఊపు మీదున్న బంగ్లాదేశ్ ను టీం ఇండియా రెండు టెస్ట్ మ్యాచ్‌లలోనూ మట్టి కరిపించింది. చిత్తుగా ఓడించింది. సొంత గడ్డపై టీం ఇండియా తన సత్తాను చాటింది. తొలుత చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో దాదాపు 280 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్ రెండో టెస్ట్ అయిన కాన్పూర్ లోనూ పట్టు కోల్పోలేదు. సునాయాసంగా విజయం సాధించింది. దీంతో టీం ఇండియా బంగ్లాదేశ్ తో ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్ లలోనూ క్లీన్ స్వీప్ చేయగలిగింది. సొంత గడ్డపై భారత జట్టుకు రికార్డ్స్ ఉన్నాయి. భారత్ లో టీం ఇండియా అనేక దేశాలతో 581 టెస్ట్ లు ఆడితే అందులో 180 మ్యాచ్ లలో గెలిచింది.

అనుకున్న లక్ష్యాన్ని...
178 టెస్ట్‌లలో ఓటమి పాలయింది. అయితే గత దశాబ్ద కాలంగా భారత్ సొంత గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ ను కోల్పోకపోవడం రికార్డు అని చెప్పాలి. రెండో టెస్ట్ కు వర్షం అడ్డంకిగా మారింది. డ్రాగా ముగుస్తుందేమోనని అందరూ భావించారు. కానీ భారత్ మాత్రం సునాయాసంగా విజయం సాధించి సొంత గడ్డపై తిరుగులేదని నిరూపించుకుంది. బంగ్లాదేశ్ ను మన బౌలర్లు రెండు ఇన్నింగ్స్ లోనూ ఆల్ అవుట్ చేశారు. కేవలం 95 పరుగుల లక్ష్యంతో బరిగిలోకి దిగిన టీం ఇండియా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఆఖరిటెస్ట్ లో యశస్వి జైస్వల్ మరో హాఫ్ సెంచరీ చేశారు. విరాట్ కొహ్లి కూడా 29 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీసగా ఎంపికయ్యాడు. యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.


Tags:    

Similar News