టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
కాసేపట్లో భారత్ - ఆస్ట్రేలియా మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది
కాసేపట్లో భారత్ - ఆస్ట్రేలియా మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఫీల్డింగ్ కు దిగనుంది. ఈరోజు రాజ్‌కోట్ లో జరగనున్న చివరి మ్యాచ్ లో గెలుపు కోసం రెండు జట్లు పోటీ పడుతున్నాయి. స్వల్ప మార్పులతో బరిలోకి దిగిన భారత్ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి చేరడంతో అదనపు బలం చేకూరినట్లయింది. అదే సమయంలో శుభమన్ గిల్ ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకోనున్నారు.
భారీ స్కోరు చేయాలని...
తొలుత బ్యాటింగ్ కు దిగి భారీ స్కోరు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆస్ట్రేలియా జట్టు ఉంది. ఇప్పటికే 2-0 తో సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ నామమాత్రమే అయినప్పటికీ క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతుంది. ఆస్ట్రేలియా పరాయి గడ్డపై ఒక్క మ్యాచ్ అయినా గెలిచి వరల్డ్ కప్ కు ముందు తమ సత్తా చాటాలని చూస్తుంది. మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.