India vs Australia : ఇండియా - ఆస్ట్రేలియా మూడో టెస్ట్ ప్రారంభం
భారత్ - ఆస్ట్రేలియా మూడో టెస్ట్ నేటి నుంచి ప్రారంభం అయింది. ఉదయం 5.50 గంటలకు బ్రిస్బేన్ లో మ్యాచ్ ప్రారంభయింది.
భారత్ - ఆస్ట్రేలియా మూడో టెస్ట్ నేటి నుంచి ప్రారంభం అయింది. ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ప్రారంభయింది. అయితే వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్రిస్బేన్ లో ప్రారంభమయిన ఈ మ్యాచ్ గెలవడం టీం ఇండియాకు అత్యవసరం. పెర్త్ లో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఆస్ట్రేలియాపై 295 భారీ స్కోరు తేడాతో విజయంసాధించింది. అయితే ఆడిలైట్ లో జరిగిన రెండో టెస్ట్ లో మాత్రం పది వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలయింది.
వరస వైఫల్యాలు...
సీనియర్ ఆటగాళ్లు అందరూ వరసగా విఫలం కావడంతో రెండో టెస్ట్ కోల్పోవాల్సి వచ్చింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు పూర్తిగా నిరాశపర్చారు. గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరి ఆటతీరు అభిమానులకు ఆగ్రహం తెప్పించే విధంగా ఉంది. వరసగా బ్యాటర్లు అవుట్ అవుతుండటం భారత్ బలహీనత. ఇప్పుడు ఇండియా కూడా తీవ్ర వత్తిడితో ఉంది. ఈ పిచ్ కూడా పేసర్లకు అనుకూలంగానే ఉంటుంది. మరోవైపు ఆట ప్రారంభమయిన తర్వాత కొద్దిసేపటికే వర్షం పడటంతో ఆట నిలిచిపోయింది. వరసగా అన్ని టెస్ట్ లు గెలిస్తేనే బారత్ వరల్డ్ కప్ ఫైనల్ కు అర్హత సాధించనుంది.