నేడు జింబాబ్వేతో మూడో వన్డే క్లీన్ స్వీప్ దిశగా
నేడు భారత్ జింబాబ్వే వన్డే మ్యాచ్ ను ఆడనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది
నేడు భారత్ జింబాబ్వే మూడో వన్డే మ్యాచ్ ను ఆడనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది. చిత్తుగా ఓడించింది. జింబాబ్వే ఈ విభాగంలోనూ సరైన ప్రతిభ చూపలేకపోయింది. పరాయి గడ్డపై భారత్ బ్యాటర్లు, బౌలర్లు విజృంభించి ఆడటంతో రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను గెలుచుకున్నారు. భారత్ బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ పటిష్టంగా ఉంది. దీంతో మూడో మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది.
పరువును కాపాడుకోవాలని...
మరోవైపు జింబాబ్వే పరువును నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. టీం ఇండియాను ఈ మ్యాచ్ లోనైనా ఓడించి సొంత గడ్డపై పరువు నిలుపుకోవాలని భావిస్తుంది. బంగ్లాదేశ్ లో వన్డే, టీ 20 సిరీస్ లను గెలిచిన జింబాబ్వే జట్టు భారత్ పై మాత్రం తేలిపోయిందనే చెప్పాలి. కనీసం ఈ మ్యాచ్ లోనైనా జింబాబ్వే ఆటగాళ్లు ప్రతిభ కనపరచి పూర్తి స్థాయిలో ఆడాలని అభిమానులు కోరుతున్నారు. యాభై ఓవర్ల వన్డే మ్యాచ్ లో కనీసం పూర్తిగా కూడా ఈ రెండు మ్యాచ్ లలో జింబాబ్వే ఆటగాళ్లు క్రీజ్ లో నిలవకుండా ఆల్ అవుట్ అయిపోయారు. ఈ మ్యాచ్ లో పట్టు బిగించాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.