మాథ్యూస్ ను టైమ్ అవుట్ చేసిన పాపం ఊరికే పోతుందా?

వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంక సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ ఊహించని రీతిలో

Update: 2023-12-06 11:02 GMT

వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంక సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ ఊహించని రీతిలో టైం అవుట్ అవ్వడంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే..! తాజాగా బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ అవుట్ అయిన విధానం గురించి ఇప్పుడు క్రికెట్ అభిమానులు చర్చించుకుంటూ ఉన్నారు. ఢాకా వేదికగా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు 41 ఓవర్లో ముష్ఫికర్ రహీమ్ అనూహ్యంగా ఔటయ్యాడు. జేమిసన్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతి ఇన్ స్వింగ్ తిరిగింది. రహీం ఈ డెలివరీని సమర్ధవంతంగా డిఫెన్స్ చేసాడు. ఈ దశలో బంతి ఒక స్టెప్ పడగా రహీం వికెట్ల వైపు వెళ్తుందని భావించి చేత్తో బంతిని టచ్ చేసాడు. దీంతో వెంటనే న్యూజిలాండ్ ప్లేయర్లు అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ గా ప్రకటించాడు.

ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగిస్తూ ఔట్ అయిన తొలి బంగ్లాదేశ్ బ్యాటర్‌గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు. 41వ ఓవర్‌లో, కైల్ జేమీసన్ ఓవర్ లో అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ వెంటనే అప్పీల్ చేయగా, దానిని టీవీ అంపైర్ అహ్సన్ రజా సమర్థించారు. "80కి పైగా టెస్టులు ఆడిన క్రికెటర్‌కి తాను అలా చేయకూడదని తెలుసుకోవాలి" అని ఈ టెస్టుకు టీవీ వ్యాఖ్యానంలో పాల్గొన్న బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ చెప్పాడు. "ప్రాక్టీస్ లో అలవాటు కారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నెట్స్‌లో, బ్యాటర్లు తరచుగా బంతిని చేతిలోకి తీసుకొని బౌలర్‌కు తిరిగి ఇచ్చేస్తారు. ముష్ఫికర్ తెలియకుండానే అలా చేసి ఉండవచ్చు. కానీ మ్యాచ్ లో ఇది మాత్రం చెప్పకూడదు." అని అన్నాడు.


Tags:    

Similar News