T20WorldCup: పాకిస్థాన్ పై విజయం సాధించిన టీమిండియా

మహిళల T20 ప్రపంచ కప్ 2024లో తమ తొలి విజయాన్ని

Update: 2024-10-06 14:55 GMT

మహిళల T20 ప్రపంచ కప్ 2024లో తమ తొలి విజయాన్ని అందుకునేందుకు భారత జట్టు తీవ్రంగా శ్రమించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆరు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల ఖాతా తెరిచింది. ఈ విజయంతో భారత్ రన్ రేట్‌ను -2.900 నుండి -1.22కి మెరుగుపరుచుకుంది. సెప్టెంబరు 9న చమరి అతపత్తు సారథ్యంలోని శ్రీలంక పై భారీ విజయం సాధిస్తేనే భారత్ NRR మరింత మెరుగవుతుంది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్ లో పాకిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం అందుకుంది. పాకిస్థాన్ మొదట 20 ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. అరుంధతి రెడ్డి 3 వికెట్లతో రాణించింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా మహిళల జట్టు 18.5 ఓవర్లలో ఛేదించింది. భారత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ షెఫాలీ వర్మ 32, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 29, జెమీమా రోడ్రిగ్స్ 23 పరుగులతో రాణించారు. ఇక నాకౌట్ దశకు చేరాలంటే గ్రూప్ దశలో మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా తప్పక గెలవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News