మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జింబాబ్వే పవర్ ప్లే ను ధాటిగా మొదలుపెట్టినప్పటికీ.. ఆ తర్వాత పెద్దగా మిగిలిన వాళ్లు రాణించకపోవడంతో రన్ రేట్ కాస్తా తగ్గిపోయింది. పాక్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ వెళ్లిపోవడంతో.. స్కోర్ బోర్డు వేగంగా ముందుకు వెళ్లలేకపోయింది. ఇక జింబాబ్వే సంచలనం సికందర్ రజా విఫలమవడంతో జింబాబ్వే మంచి స్కోర్ సాధించలేకపోయింది. మొహమ్మద్ వసీమ్ జూనియర్ 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. షాదాబ్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. హారిస్ రావూఫ్ 1 వికెట్ తీసుకున్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో జింబాబ్వే సంచలన విజయాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్ పై ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే విజయాన్ని అందుకుంది. ఆఖరి బంతి వరకూ జరిగిన సస్పెన్స్ థ్రిల్లర్ లో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతికి పాక్ కు 3 పరుగులు కావాల్సి ఉండగా.. కేవలం ఒక్క పరుగు మాత్రమే రావడంతో జింబాబ్వే సంచలనాన్ని నమోదు చేసింది.