Telangana Elections : మునుగోడులో 91.51 శాతం పోలింగ్

తెలంగాణ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 91.51 శాతం పోలింగ్ నమోదయింది;

Update: 2023-12-01 03:29 GMT
election commission, votes, hyderabad, andhra pradesh
  • whatsapp icon

తెలంగాణ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్ లకు తరలించారు. అయితే 70.66 శాతం తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ అయినట్లు సమాచారం. సాయంత్రం ఐదు గంటల వరకూ క్యూ లైన్‌లలో ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో రాత్రి పది గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. పోలింగ్ 70 శాతాన్ని దాటడటంతో అధికారులు సయితం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

యాకుత్‌పురాలో తక్కువగా...
అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 91.51 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా యాకుత్‌పురాలో 39.69 శాతం పోలింగ్ నమోదయిందని అధికార వర్గాలు వెల్లడించాయి. వీటిలో మరికొంత మార్పులు చేర్పులు చేసుకునే అవకాశముంది. గత ఎన్నికల్లో 73.37 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈసారి అంతే స్థాయిలో అయ్యే అవకాశాలున్నాయి. ఈవీఎంలు కూడా ఎక్కడా మొరాయించినట్లు వార్తలు రాలేదు. అలాగే చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి.


Tags:    

Similar News