కేసీఆర్‌కు కోమటిరెడ్డి లేఖ
భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు
భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. సెప్టంబరు నెలలో సగం రోజులు గడిచిపోయినా ఉద్యోగులకు జీతాలు ఎందుకు చెల్లించలేకపోతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. పధ్దెనిమిది నెలలుగా ప్రభుత్వ ఉద్యోగాలకు పీఆర్సీ లేదన్న కోమటిరెడ్డి రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టిన ఘనత కేసీఆర్ కు దక్కిందన్నారు. అప్పులు చేసి ఎవరికి పంచి పెడుతున్నారని కోమటిరెడ్డి నిలదీశారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా ఆయన కేసీఆర్‌కు రాసిన లేఖలో నిలదీశారు.
జీతాలు సక్రమంగా...
ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించలేని స్థితిలో రాష్ట్రాన్ని నెట్టడం దురదృష్టకరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. కొత్త ఉద్యోగాలు లేవని, పనిచేసే వారికైనా కనీసం జీతాలు ఇవ్వాలని ఆయన కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. భూములు అడ్డగోలుగా విక్రయించి బీఆర్ఎస్ నేతలకు పంచి పెడుతున్నారన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ ను అధికారంలో కొనసాగించడం ఇక ఏమాత్రం క్షేమకరం కాదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పనితీరు రాష్ట్ర ఖజానాను చూస్తేనే అర్థమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు.