మెదక్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం.. వ్యక్తిపై దాడి

మెదక్ జిల్లా దూపిసింగ్ తండాలో ఎలుగుబంటి కలకలం రేపుతుంది. ఒక వ్యక్తిపై దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు

Update: 2024-08-26 06:14 GMT

మెదక్ జిల్లా దూపిసింగ్ తండాలో ఎలుగుబంటి కలకలం రేపుతుంది. ఒక వ్యక్తిపై దాడి చేయడంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం దూపిసింగ్ తండాలో నివాసం ఉంటున్న రవి పొలంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో రవికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.

అటవీ శాఖ అధికారులు...
ప్రాణాపాయం లేకపోయినప్పటీకీ ఎలుగుబంటి సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వచ్చి ఎలుగుబంటిని బంధించి తీసుకెళ్లాలని గ్రామస్థులు కోరుతున్నారు. తాము పొలం పనులకు వెళ్లాలంటే భయంగా ఉందని చెబుతున్నారు. ఎలుగుబంటిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.


Tags:    

Similar News