బ్రేకింగ్ : సింహం గుహలోకి యువకుడు. హైదరాబాద్ జూపార్క్ లో..?

హైదరాబాద్ లోని జూపార్క్ లో ఒక యువకుడు హల్ చల్ చేశారు

Update: 2021-11-23 12:43 GMT

హైదరాబాద్ లోని జూపార్క్ లో ఒక యువకుడు హల్ చల్ చేశారు. సాయికుమార్ అనే యువకుడు సిబ్బంది కళ్లు గప్పి సింహం ఉన్న ఎన్ క్లోజర్ లోకి వెళ్లారు. సింహం ఉన్న ఎన్ క్లోజర్ లోకి వెళ్లిన సాయికుమార్ ను వెంటనే సిబ్బంది, ప్రజలు వెనక్కు లాగారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.

పోలీసుల ఆరా....
సాయికుమార్ ను జూ అధికారులు పోలీసులకు అప్పగించారు. అతనిని విచారిస్తున్నారు. సింహం ఉన్న ఎన్ క్లోజర్ చుట్టూ కంచె ఉంటుంది. దానిని దాటుకుని, సిబ్బంది కళ్లుగప్పి సాయికుమార్ ఎలా వెళ్లాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జూ పార్కులో ఈ సంఘటన జరగడంతో చూసేందుకు వచ్చిన వారిని అధికారులు పంపించి వేస్తున్నారు.


Tags:    

Similar News