Congress Leader Birthday: పోలీసు స్టేషన్ లో కాంగ్రెస్ నేత బర్త్ డే.. చివరికి!!

సంగారెడ్డిలోని పోలీస్‌స్టేషన్‌లో వట్‌పల్లి సబ్‌ఇన్‌స్పెక్టర్;

Update: 2024-09-09 08:03 GMT
Congress Leader Birthday: పోలీసు స్టేషన్ లో కాంగ్రెస్ నేత బర్త్ డే.. చివరికి!!
  • whatsapp icon
సంగారెడ్డిలోని పోలీస్‌స్టేషన్‌లో వట్‌పల్లి సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) లక్ష్మణ్‌ కాంగ్రెస్‌ నేత పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై తెలంగాణ పోలీసు శాఖ సీరియస్‌ యాక్షన్ తీసుకుంది. పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ, ఇతర కానిస్టేబుళ్ల సమక్షంలో కాంగ్రెస్ నేత జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ వీడియోలు, ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. సమగ్ర నివేదిక అందిన తర్వాత ఎస్‌ఐపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మల్టీ జోన్‌ ఐజీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఇప్పటికే లక్ష్మణ్‌ను ఆదేశించారు. మల్టీ-జోన్ II ఐజీపీ కార్యాలయంలో వెంటనే రిపోర్టు చేయాలని SI లక్ష్మణ్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, పోలీస్ స్టేషన్‌లో కేక్ కట్ చేసిన ఘటనను సీరియస్‌గా తీసుకున్నామని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News