మమ్మల్ని విడదీయకండి... ఉద్రిక్తంగా మారిన ధర్నా
ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంఎదుట ఉపాధ్యాయ దంపతులు ధర్నా చేశారు
ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంఎదుట ఉపాధ్యాయ దంపతులు ధర్నా చేశారు. భార్యాభర్తలకు ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. వేర్వేరు చోట్ల విధులు నిర్వర్తించడం కష్టంగా మారిందని, పిల్లల భవిష‌్యత్ కోసం ప్రభుత్వం భార్యాభర్తలను ఒకే చోట పోస్టింగ్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ వారు ధర్నాకు దిగారు.
పిల్లలతో కలసి...
వందల సంఖ్యలో కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు బలవంతంగా పిల్లలు, తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేయడంతో వారిని కంట్రోల్ చేయడం కూడా ఒక దశలో కష్టంగా మారింది.